వారిని రక్షించండి.. టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్

ABN, Publish Date - Mar 03 , 2025 | 04:15 PM

Telangana High Court: పదిరోజులైనా టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీ దొరకలేదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.

హైదరాబాద్, మార్చి 3: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై (SLBC Tunnel) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటన జరిగి పదిరోజులైనా కార్మికుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్‌లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం కూడా నిత్యం సహాయక చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


టన్నెల్‌ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్ పాల్గొన్నాయని ఏజీ తెలిపారు. 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. ఏజీ వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది.


ఇవి కూడా చదవండి...

Parcel explosion: ఆటో నుంచి పార్శిల్‌ను దించుతుండగా అనుకోని ఘటన..

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 03 , 2025 | 04:21 PM