New Ration Cards: కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆ రోజే..!

ABN, Publish Date - Jul 12 , 2025 | 09:59 PM

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తుంగతుర్తిలో సీఎం రేవంత్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయనున్నారు.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తుంగతుర్తిలో సీఎం రేవంత్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ప్రజా పాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీసేవ ద్వారా రేషన్ కార్డుల కోసం 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటింటి పరిశీలన చేసిన అధికారులు 13 లక్షల దరఖాస్తులకు సంబంధించిన పేర్లను చేర్చారు. 2 లక్షల 55 వేల కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా నిర్ధారించారు.

Updated at - Jul 12 , 2025 | 09:59 PM