చెన్నైలో ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు కలకలం
ABN, Publish Date - Nov 17 , 2025 | 08:44 PM
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు స్టార్ హీరో అజిత్ కుమార్, నటులు అరవింద్ స్వామి, ఖుష్బూల నివాసాలకు ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు
తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు స్టార్ హీరో అజిత్ కుమార్, నటులు అరవింద్ స్వామి, ఖుష్బూల నివాసాలకు ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి నేరుగా ఈ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్‌లతో ముఖ్యమంత్రి నివాసంతో సహా నటుల ఇళ్ల వద్ద గంటల తరబడి తనిఖీలు జరిగాయి. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో ఈ బెదిరింపులు బూటకమైనవిగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఆయుధ నిల్వల ఆరోపణలపై బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు
88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated at - Nov 17 , 2025 | 08:44 PM