ఏపీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
ABN, Publish Date - Mar 18 , 2025 | 04:25 PM
Krishna River projects Supreme Court: కృష్ణానదీ పరివాహక ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించాలంటూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తు తెలంగాణ పిటిషన్ వేయగా.. ఈరోజు విచారణ జరిగింది.
న్యూఢిల్లీ, మార్చి 18: కృష్ణానదీ పరివాహక ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించాలంటూ 2021 జులై 15న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ (Telangana) వేసిన పిటిషన్‌ను ఈరోజు (మంగళవారం) ధర్మాసనం విచారించింది. అంతకు ముందు కృష్ణా నది ప్రాజెక్టుల నుంచి అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటున్నారని, అందుకు అనుగుణంగా తెలంగాణ జారీ చేసిన జీఓ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్‌లను కలిపి సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.
కేంద్రం నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని తెలంగాణ మరో పిటిషన్ దాఖలు చేసింది. స్టే ఇవ్వాలని తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇరు ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేసిన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
Arrest: యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..
DK Aruna Home Theft Case: డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో కీలక పరిణామం
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 18 , 2025 | 04:25 PM