అరెస్టు సమయంలో వంశీ డ్రామాలు: సోమిరెడ్డి
ABN, Publish Date - Feb 13 , 2025 | 01:46 PM
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగమని.. ఇలాంటి మృగాన్ని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని ఆయన అన్నారు.
అమరావతి: తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అని, ఈ మృగాన్ని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని, వంశీతో పాటు మరో నాలుగైదు జంతువులు కూడా ఊచలు లెక్కపెట్టి తీరాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు (TDP Leader) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. అరెస్టు సమయంలోనూ వంశీ డ్రామాలాడారని, డ్రెస్ మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లి అందరికీ ఫోన్లు చేసి అల్లర్లు చేయాలని రెచ్చకొట్టారని మండిపడ్డారు.
ఈ వార్త కూడా చదవండి..
వాళ్లంతా అరెస్టు కాక తప్పదు: కొల్లు రవీంధ్ర
ఏం పీకుతారంటూ ఎగిరెగిరి పడి ఎన్నికల ఫలితాల రోజు మొదటి రౌండ్ కే పారిపోయిన పిరికి పంద వంశీ అని సోమిరెడ్డి అన్నారు. శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదా.. అని ప్రశ్నించారు. చేసిన ఒక తప్పు కప్పి పుచ్చుకోవటానికి వందల తప్పులు చేయటం వైసీపీ నైజం మని, వంశీని ఇన్నాళ్లు ఎలా ఉపేక్షించారో అర్ధం కావట్లేదన్నారు. రాయలసీమలో అయితే వ్యవహారం ఇంకోలా ఉండేదన్నారు. వంశీ ప్రవర్తనను ఖండించకపోగా వైసీపీ సీనియర్లు సమర్ధించడం దురదృష్టకరమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీ అరెస్టుపై బొత్స స్పందన
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట
రుణం కట్టలేదని.. ఇంత దారుణమా..: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 13 , 2025 | 01:46 PM