వాళ్లంతా అరెస్టు కాక తప్పదు: కొల్లు రవీంధ్ర
ABN, Publish Date - Feb 13 , 2025 | 01:17 PM
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ.. ఏదో ఒక రోజు అరెస్టు కాక తప్పదని, అధికారం ఉంది కాదా అని విర్రవీగితే ఏమవుతుందో అనే దానికి వంశీ అరెస్టు ఒక నిదర్శనమని మంత్రి కొల్లు రవీంధ్ర అన్నారు.
అమరావతి: రాజారెడ్డి రాజ్యంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం (Jagan regime)లో ఐదేళ్లు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేకమందిపై తప్పుడు కేసులు (False Cases) పెట్టి, అక్రమంగా దోపిడీలు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra ) విమర్శించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం (TDP Office)పై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి.. అతనిని భయపెట్టి కోర్టులో తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించిన నేపథ్యంలో సత్యవర్ధన్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)ని పోలీసులు అరెస్టు (Arrest) చేశారన్నారు. జగన్‌ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ.. ఏదో ఒక రోజు అరెస్టు కాక తప్పదన్నారు. అధికారం ఉంది కాదా అని విర్రవీగితే ఏమవుతుందో అనే దానికి వంశీ అరెస్టు ఒక నిదర్శనం అని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
వల్లభనేని వంశీ అరెస్టుపై బొత్స స్పందన
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట
రుణం కట్టలేదని.. ఇంత దారుణమా..: కేటీఆర్
శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 13 , 2025 | 01:17 PM