విద్యార్థులు బొట్టుపెట్టుకుంటే అంత నేరమా
ABN, Publish Date - Mar 04 , 2025 | 01:12 PM
School Principal Overraction: నగరంలోని ఓ స్కూల్‌లో విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ ప్రవర్తించి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ ఓవరాక్షన్‌తో విద్యార్థుల పేరెంట్స్ స్కూల్‌లో ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి కలిగింది.
హైదరాబాద్, మార్చి 4: నగరంలోని పెద్దఅంబర్ పేట్ కండోర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ ఓవరాక్షన్‌తో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారని వారిని ప్రిన్సిపల్ చితకబాదాడు. బలవంతంగా వాష్ రూంలోకి తీసుకెల్లి బొట్టు తీయించేశారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ తీరుపై మండిపడ్డారు. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం.. స్కూల్ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది.
ప్రిన్సిపల్ చేసిన పనిపై విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఉదయం బొట్టు పెట్టుపెట్టుకుని స్కూల్‌కు వెళ్లాను. అసెంబ్లీ అయిన తర్వాత ప్రిన్సిపల్ అందరి వద్దకు వస్తూ యూనిఫామ్స్ చెక్ చేశారు. నేను వెనక నిలబడ్డాను. నా దగ్గరకు వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావని అడిగారు. నాకు అర్ధం కాలేదని చెప్పగానే.. మెడపై కొట్టారు. వెళ్లి బొట్టు తీసేయ్ అంటూ వాష్‌రూమ్ వరకు లాక్కెళ్లారు. క్లాస్‌లో కూడా బొట్టు పెట్టుకుని ఎవరు కనిపించినా బొట్టు తీసేయాలని.. ఎందుకు పెట్టుకున్నావని ప్రిన్సిపల్ అడుగుతారు’’ అని విద్యార్థి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే
Congress Reviews: తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 09 , 2025 | 04:47 PM