జెడ్పీ సమావేశంలో అరుపులు, కేకలు

ABN, Publish Date - Jan 30 , 2025 | 01:44 PM

ZP Meeting: అరుపులు కేకలతో అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మారుమోగింది. వైసీపీ పాలనలో సాగునీటిని పుంగనూరుకు తరలించారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఒక్క చెరువుకు కూడా నీటిని వదల్లేదన్నారు. ఇక్కడ సాగునీటిని వదలకుండా పుంగనూరుకు తరలించారంటూ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అనంతపురం, జనవరి 30: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. ఏపీలో వాట్సప్ గవర్నన్స్‌పై జిల్లా పరిషత్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. గురువారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభం అవగా.. వాట్సప్ గవర్నన్స్‌ తీర్మానాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బలపరిచారు. అయితే దీనిపై వైసీపీ జెడ్పీటీసీలు అభ్యంతరం తెలిపారు. జెడ్పీటీసీల తీరుపై హిందూపురం ఎంపీ బి కే పార్థసారథి, ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం నాశనం చేశారంటూ ఎంపీ పార్థసారథి ఆగ్రహించారు.


ప్రజలు ఛీ కొట్టిన వైసీపీకి బుద్ధిలేదంటూ మండిపడ్డారు. ‘‘మీ సొంత గ్రామాల్లో ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేయించారా’’ అంటూ వైసీపీ జెడ్పీటీసీలను ఎంఎస్‌రాజు ప్రశ్నించారు. దీంతో జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. అరుపులు కేకలతో అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మారుమోగింది. వైసీపీ పాలనలో సాగునీటిని పుంగనూరుకు తరలించారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఒక్క చెరువుకు కూడా నీటిని వదల్లేదన్నారు. ఇక్కడ సాగునీటిని వదలకుండా పుంగనూరుకు తరలించారంటూ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి...

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated at - Jan 30 , 2025 | 01:44 PM