తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే... సారీ
ABN, Publish Date - Nov 12 , 2025 | 04:59 PM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌ను సీఐడీ విచారించింది. ఈ సందర్భంగా జంగిల్ రమ్మీ యాప్ యాజమాన్య ఒప్పంద పత్రాలను సిట్‌కు ప్రకాష్ రాజ్ ఇచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 12: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌ను (Prakash Raj) సీఐడీ ప్రశ్నించింది. జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేసిన కేసులో ప్రకాష్ రాజ్ ఈరోజు (బుధవారం) విచారణకు హాజరయ్యారు. జంగిల్ రమ్మీ యాప్ యాజమాన్య ఒప్పంద పత్రాలను సిట్‌కు నటుడు అందజేశారు. ఇప్పటికే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నిన్న (మంగళవారం) నటుడు విజయ్ దేవరకొండను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఇక విచారణ అనంతరం ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. 2016లో బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదని యాప్ గురించి మాత్రమే యాడ్ చేసినట్లు తెలిపారు.
ఆ తరువాత బెట్టింగ్ అవడంతో అందులో నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీఐడీకి చెప్పానన్నారు. బెట్టింగ్ యాప్ చాలా తప్పని... దీని వల్ల యువత జీవితాలు పాడవుతున్నాయన్నారు. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే అని నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎక్కడి సమస్యలు అక్కడే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కవిత విసుర్లు
మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం
Read Latest Telangana News And Telugu News
Updated at - Nov 12 , 2025 | 05:07 PM