BRS MLC Kavitha: కవిత అంశంపై తెలంగాణలో రాజకీయ చర్చ..

ABN, Publish Date - May 30 , 2025 | 09:57 PM

తెలంగాణలో రాజకీయ రచ్చ ఇప్పుడు మరోసారి తారా స్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ MLC కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని, ఆమె రాసిన లేఖ సహా పలు అంశాలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణలో కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారనే వార్తలు రాజకీయ రచ్చకు దారితీశాయి. ఈ క్రమంలో కవిత తన సొంత పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, జూన్ 2, 2025న ప్రకటన ఉండవచ్చని వార్తలు వచ్చాయి. కవిత తన సోదరుడు కేటీఆర్, తండ్రి కేసీఆర్‌లపై అసంతృప్తితో ఉన్నారని, లిక్కర్ స్కాం కేసులో ఆమెను ఇరికించడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలు పార్టీల నాయకులు అనేక విధాలుగా స్పందించారు. ఏమన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Updated at - May 30 , 2025 | 09:58 PM