ప్రధాని పుట్టపర్తి పర్యటన.. కట్టుదిట్టమైన భారీ భద్రత

ABN, Publish Date - Nov 18 , 2025 | 06:41 PM

పుట్టపర్తి సాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా బుధవారం హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఉత్సవాలకు వస్తున్నారు.

పుట్టపర్తి సాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా బుధవారం హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఉత్సవాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. రాష్ట్రప్రభుత్వంతోపాటు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్‌ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. ఈ ఉత్సవాలు నారాయణ సేవతో ప్రారంభమైనాయి. ఈ రోజు రథోత్సవం సైతం నిర్వహించారు.


మంగళవారం సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి లోకేశ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రజాప్రతినిధులతోపాటు నేతలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి పుట్టపర్తిలోనే సీఎం చంద్రబాబు, లోకేశ్ బస చేయనున్నారు. రేపు శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో వీరు పాల్గొనున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

హిడ్మా అనుచరుల కోసం పోలీసుల వేట..!

ఉగ్రవాది డానిష్ కు 10 రోజులు కస్టడీ విధించిన పాటియాలా హౌస్ కోర్టు

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 18 , 2025 | 06:54 PM