పులి, సింహం పిల్లలను ఆడించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Mar 04 , 2025 | 01:54 PM
గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వంతారాలో జంతు సంవరక్షణ పునరావాస కేంద్రం ప్రారంభించారు. ఈ కేంద్రం 43 జాతులకు చెందిన 2 వేలకుపైగా జంతువులకు ఆశ్రయం ఇస్తోంది. ప్రధాని మోదీ పులి, సింహం పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆడించారు.
గుజరాత్: రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి గుజరాత్ పర్యటనలోనే (Gujarat Visit) ఉన్న ప్రధాని వన్య ప్రాణులు, ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి సఫారి చేసిన ప్రధాని మంగళవారం వంతారా (Vantara)లో జంతు సంవర్షణ పునరావాస కేంద్రం ప్రారంభించారు.
Read More..
వైసీపీ తెచ్చిన దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా..
గుజరాత్‌లోని జామ్ నగర్‌లో 3,500 ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంవరక్షణ కేంద్రం వంతారా. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ఆలోచనలోంచి పుట్టిన ఈ వంతారా జంతు సంవర్షణ కేంద్రం 43 జాతులకు చెందిన 2 వేలకుపైగా జంతువులకు ఆశ్రయం ఇస్తోంది. వంతారాను సందర్శించిన ప్రధాని మోదీ అక్కడి జంతువులను మచ్చిక చేసుకున్నారు. పులి, సింహం పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆడించారు. కొన్నింటికి ఆహారం పాలు అందించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా..
శ్రీశైలం పరిసరాల్లో పులులు, చిరుతల హల్ చల్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 04 , 2025 | 01:54 PM