కేటీఆర్ పేరుతో టీ స్టాల్.. కలెక్టర్ సీరియస్..

ABN, Publish Date - Feb 21 , 2025 | 09:53 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద కేటీఆర్ పేరుతో ఉన్న టీస్టాల్ వ్యవహారం రసాభాసగా మారింది. మున్సిపల్ అధికారులు ఆ టీస్టాల్‌ను ట్రాక్టర్‌తో అక్కడి నుంచి తరలించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద కేటీఆర్ పేరుతో ఉన్న టీస్టాల్ వ్యవహారం రసాభాసగా మారింది. మున్సిపల్ అధికారులు ఆ టీస్టాల్‌ను ట్రాక్టర్‌తో అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న టీ స్టాల్ యజమాని.. అక్కడికి వచ్చి వాహనాన్ని అడ్డుకున్నాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. లైలెన్స్ లేదనే కారణంతో ఇలా చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Updated at - Feb 21 , 2025 | 09:53 PM