Maost Party: ఆఖరి ఘడియల్లో మావోయిస్టు పార్టీ.. వర్గపోరుతో అలజడులు..

ABN, Publish Date - Sep 24 , 2025 | 12:59 PM

50 ఏళ్ల నక్సలిజం ఆఖరి గడియల్లో ఉంది. అంతిమ పోరాటంలో అగ్రనేతలు వరుస ఎన్‌కౌంటర్లలో నేలరాలుతున్నారు. మే 21 పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతమయ్యాక.. వరుస ఎన్‌కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు దళాలు పిట్టల్లా రాలిపోతున్నారు.

50 ఏళ్ల నక్సలిజం ఆఖరి గడియల్లో ఉంది. అంతిమ పోరాటంలో అగ్రనేతలు వరుస ఎన్‌కౌంటర్లలో నేలరాలుతున్నారు. మే 21 పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతమయ్యాక.. వరుస ఎన్‌కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు దళాలు పిట్టల్లా రాలిపోతున్నారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శపథం చేశారు. ఆ టార్గెట్ దిశగా ఆపరేషన్ కగార్ ముందుకు సాగుతోంది.


ఛత్తీస్‌గడ్ నారాయణ్‌పూర్ జిల్లా హపూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ, మరో సభ్యుడు కట్టా రామ చంద్రారెడ్డి హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మృతి చెందారు. వారికి రక్షణగా ఉన్న దళ సభ్యులు.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసు వర్గాలు వెళ్లడించలేదు. దీంతో మావోయిస్టు పార్టీలో వర్గపోరు.. కోవర్టు ఆపరేషన్‌కు దారి తీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కమిటీ నిలువునా చీలి, వర్గపోరుతో పార్టీలో కల్లోలం రేగిందని పౌర హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated at - Sep 24 , 2025 | 12:59 PM