Dangerous Canal: ప్రాణాలు తీస్తున్న కెనాల్..
ABN , First Publish Date - 2025-04-18T14:02:25+05:30 IST
పంట కాలువ జీవనాడి వంటిది. పంటలు పండించి పది మందికీ అన్నం పెడుతుంది. అయితే నిర్వహణ సరిగా లేకపోతే అదే పంటకాలువ ప్రజల ప్రాణాలు తీస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతోంది.
పంట కాలువ జీవనాడి వంటిది. పంటలు పండించి పది మందికీ అన్నం పెడుతుంది. అయితే నిర్వహణ సరిగా లేకపోతే అదే పంటకాలువ ప్రజల ప్రాణాలు తీస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతోంది. కాలువలో పడి వారానికొకరు చనిపోతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు జీవధారగా ఉన్న ఎస్‌ఆర్ఎస్‌పీ కెనాల్ జనాల ప్రాణాలు తీస్తోంది. పచ్చని పైర్లకు జీవం పోస్తూ సాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కెనాల్ పచ్చి నెత్తురు తాగుతోంది. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే ఈ కాలువలో పడి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కెనాల్‌పై ఉన్న వంతెనలు కాలం చెల్లడంతో ప్రమాదకరంగా మారాయి.