హరీష్‌తో కేటీఆర్‌ భేటీ.. ఎందుకంటే

ABN, Publish Date - May 16 , 2025 | 04:10 PM

KTR Meets Harish: మాజీ మంత్రి హరీష్‌రావుతో కేటీఆర్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కోకాపేటలోని హరీష్‌ ఇంటికి వెళ్లిన కేటీఆర్‌ దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు.

హైదరాబాద్, మే 16: బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావుతో (Former Minister Harish Rao) ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) సమావేశమయ్యారు. ఈరోజు (శుక్రవారం) కోకాపేటలోని హరీష్ నివాసంలో ఇరువురు నేతలు సుమారు రెండు గంటల పాటు రాజకీయాలపై చర్చించారు. పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందన్న ప్రచారం జోరుగా జరుగుతుండటంతో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే హరీష్ ‌రావుతో కేటీఆర్‌ భేటీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు హరీష్‌రావు తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కేటీఆర్‌ పరామర్శకు వెళ్లారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.


ఈ మధ్య కాలంలో హరీష్‌రావుకు బీఆర్‌ఎస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గించారంటూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత నెల 27న వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు కేటీఆర్‌ అన్నీ తానై వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పార్టీలో హరీష్‌రావుకు ప్రాధాన్యత తగ్గిందనేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు హరీష్‌తో కేటీఆర్‌ సమావేశం అయినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Read latest Telangana News And Telugu News

Updated at - May 16 , 2025 | 04:10 PM