ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతు వినూత్న నిరసన

ABN, Publish Date - Nov 24 , 2025 | 02:16 PM

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ రైతు దంపతులు వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం గుమ్మం దగ్గర అడ్డంగా పడుకుని తమ నిరసన తెలిపారు.

ఖమ్మం, నవంబర్ 24: నేలకొండపల్లిలో ఓ రైతు దంపతులు వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీస్ గుమ్మం దగ్గర అడ్డంగా పడుకుని తమ నిరసన తెలిపారు. తన భార్య పేరు మీద ఉన్న భూమికి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు భూమిని చూపించడం లేదని దంపతులు వాపోయారు. 229 సర్వే నెంబర్లో 36 గుంటల భూమి తక్కువ ఉందని తెలిపారు. న్యాయం కోసం 2013లో హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడి భూమిని సర్వే చేసి.. ఆయనకు న్యాయం చేయాలని 2024లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఈ దంపతులు తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

నా గురించి మాట్లాడితే తాట తీస్తా... నిరంజన్‌కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్

Updated at - Nov 24 , 2025 | 02:17 PM