Hyderabad Drug Bus: హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్ పెట్టిన పోలీసులు
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:29 AM
న్యూఇయర్ వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటీ మాదాపూర్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో పలువురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల MDMA, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ ఈవెంట్‌ను టార్గెట్‌గా పెట్టుకొని డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తోంది ముఠా. మొత్తం ముగ్గురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 42 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
భాగ్యనగరంలో మరోసారి భూముల వేలం.. అమ్మకానికి సిద్ధంగా కోకాపేట, మూసాపేట భూములు
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
Read Latest Telangana News And Telugu News