Share News

Kavitha: నా గురించి మాట్లాడితే తాట తీస్తా... నిరంజన్‌కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:22 PM

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిరంజన్ చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు.

Kavitha: నా గురించి మాట్లాడితే తాట తీస్తా... నిరంజన్‌కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్
Kavitha

హైదరాబాద్, నవంబర్ 24: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై (Former Minister Niranjan Reddy) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన మూడు నాలుగు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని.. చెప్ప లేనంత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మార్వో ఆఫీస్‌ను కాల్చేస్తే కూడా ప్రజలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని.. ఎదురు తిరిగిన 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారంటూ మాజీ మంత్రిపై ఫైర్ అయ్యారు.


ఇలాంటి అవినీతిపరుడిని చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయమన్నారు. వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి రాచరిక పాలనను తలపించారని విమర్శించారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని నిరంజన్ రెడ్డి తనకు తాను నీళ్ల నిరంజనుడుగా పేరు మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘నా గురించి ఇంకొక్కసారి ఎక్కడైనా మాట్లాడితే నీ తాట తీస్తా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో’ అంటూ నిరంజన్‌ రెడ్డికి కవిత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 01:09 PM