ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. ఆర్ఎస్ఎస్ కారణమా..?
ABN, Publish Date - Oct 13 , 2025 | 09:23 PM
కేరళలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని ఓ లాడ్జ్‌లో కొట్టాయం జిల్లాకు చెందిన ఆనందు అజి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్‌పై పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని ఓ లాడ్జ్‌లో కొట్టాయం జిల్లాకు చెందిన ఆనందు అజి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్‌పై పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆర్ఎస్ఎస్‌లో గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నానని, దీంతో తాను మానసికంగా కుంగిపోయానంటూ ఆనందు అజి పేర్కొన్నారు. చిన్నతనంలో జరిగిన వేధింపులు ఇంకా డిప్రెషన్‌లోకి తీసుకెళ్లాయంటూ ఆనందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఆనందు అజి చేసిన ఆరోపణలపై విచారణకు ఆర్ఎస్ఎస్ నేతలు అంగీకరించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
నోబెల్ శాంతి బహుమతి సమాచారం లీక్
58 మంది పాక్ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated at - Oct 13 , 2025 | 09:23 PM