Telangana Assembly: అసెంబ్లీకి వేళాయే..కేసీఆర్ హాజరుపై తీవ్ర ఉత్కంఠ

ABN, Publish Date - Mar 12 , 2025 | 10:19 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ , శాసన మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ , శాసన మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. గురువారం నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలు ఉంటాయి.


ఈసారి అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను సభలో నిలదీసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ వన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 2025 - 2026 బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, మండలిలో చర్చించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్‌రెడ్డి సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరనున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 12 , 2025 | 10:34 AM