టిప్పు సుల్తాన్ వారసుడినంటూ బురిడీ.. చివరకు

ABN, Publish Date - Mar 04 , 2025 | 01:28 PM

Doctor Arrest: టిప్పు సుల్తాన్ వారసుడినంటూ కోట్లు వసూలు చేసి పరారైన డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనగామలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

జనగామ, మార్చి 4: జనగామలో ప్రముఖ డాక్టర్ సుల్తాన్ రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను టిప్పు సుల్తాన్ వారసుడినంటూ, టిప్పు సుల్తాన్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అంటూ పలువురి నుంచి రూ.5.56 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా పనిచేశారు డాక్టర్ సుల్తాన్ రాజా. జనగామలో కేకే ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రముఖ వైద్యుడిగా సుల్తాన్ రాజా చలామణి అయ్యారు. తమినాడు రాష్ట్రంలోని కుంభం ప్రాంతానికి చెందిన వ్యక్తి అబ్దుల్ రహీమ్ సుల్తాన్ రాజా. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి వరంగల్‌లోని జనగామలో కేకే ఆస్పత్రిని నిర్వహించారు. ఈ క్రమంలో తాను టిప్పు సుల్తాన్ వారసుడిగా అందరికీ పరిచయం చేసుకున్నాడు.


తన పేరుపై రూ.700 కోట్ల ఆస్తి ఉందని, టిప్పు సుల్తాన్ ట్రస్ట్‌కు చైర్మన్‌ అని, కర్ణాటక ప్రభుత్వం తన ట్రస్ట్‌కు రూ.700 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ డబ్బుతో హైదరాబాద్‌లో ప్రముఖ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని .. అందులో ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద కోటి, కోటిన్నర పై చిలుకుగా వసూలు చేశాడు. దాదాపు రూ.5.5 కోట్లు దండుకున్నాడు. అనంతరం ఆ డబ్బుతో సుల్తాన్ రాజా పరారయ్యాడు. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు సుల్తాన్‌ రాజాను అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే

విద్యార్థులు బొట్టుపెట్టుకుంటే అంత నేరమా

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 04 , 2025 | 01:34 PM