పిఠాపురంకు జనసేనాని

ABN, Publish Date - Mar 14 , 2025 | 04:09 PM

Pawan Kalyan Pithapuram visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి పిఠాపురంకు బయలుదేరి వెళ్లారు. పిఠాపురం చిత్రాడలో జరిగే జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ పాల్గొననున్నారు.

హైదరాబాద్, మార్చి 14: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పిఠాపురంకు బయలుదేరారు. మాదాపూర్ నివాసం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్‌కు పయనమైన పవన్.. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ తరువాత ఈరోజు సాయంత్రం పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పాల్గొననున్నారు. పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్నారు. థాంక్యూ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. ఆవిర్భావ సభకు పెద్ద సంఖ్యలో జనసైనికులు తరలివస్తున్నారు. తమిళం, కన్నడ భాషల్లోనూ ఫ్లెక్సీలు, సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. జనసేన ఆవిర్భావ సభతో చిత్రాడలో పండగ వాతావరణం నెలకొంది.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated at - Mar 14 , 2025 | 04:09 PM