ఐఎన్‌టీయూసీ నేతల బాహాబాహీ

ABN, Publish Date - May 19 , 2025 | 04:12 PM

INTUC leaders Clash: చాలా రోజులుగా ఐఎన్‌టీయూసీ ఆర్ అనే పేరుతో అంబటి కృష్ణ‌మూర్తి అనే వ్యక్తి సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ ఐఎన్‌టీయూసీ అనేది ఒకటే ఉంటుంది. ఐఎన్‌టీయూసీ ఆర్ అని పెట్టుకోవడానికి ఎలాంటి అర్హత లేదని సంజీవ్ రెడ్డి వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్, మే 19: బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం ఐఎన్‌టీయూసీ నేతలు (INTUC Leaders) బాహాబాహీకి దిగారు. సంజీవ్ రెడ్డి, అంబటి కృష్ణ మూర్తి వర్గాల మధ్య గొడవ దాడుల వరకు వెళ్లింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఐఎన్‌టీయూసీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి చాలా రోజులుగా పరస్పరం దూషణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఓ వర్గం ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా.. మరొక వర్గానికి సంబంధించిన నేతలు వెళ్లి ప్రెస్‌మీట్‌ను అడ్డుకుని వారిని దుర్భాషలాడారు. ఒక వర్గానికి చెందిన నేతల అనుచరులు మరొక వర్గానికి చెందిన నేతల అనుచరులు కొట్టుకున్నారు.


వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని సంజీవ్ రెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులుగా ఐఎన్‌టీయూసీ ఆర్ అనే పేరుతో అంబటి కృష్ణ‌మూర్తి అనే వ్యక్తి సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ ఐఎన్‌టీయూసీ అనేది ఒకటే ఉంటుంది. ఐఎన్‌టీయూసీ ఆర్ అని పెట్టుకోవడానికి ఎలాంటి అర్హత లేదని సంజీవ్ రెడ్డి వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ వినకుండా ఎప్పటికప్పుడు వారు ప్రెస్‌మీట్‌లు నిర్వహించడం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..

Read Latest Telangana News And Telugu News

Updated at - May 19 , 2025 | 04:12 PM