Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..
ABN , Publish Date - May 19 , 2025 | 09:12 AM
Diamond: ప్రస్తుతం వేసవి కాలమే అయినా.. అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొలంలో పనులు చేసుకుంటున్న రైతుకు వజ్రం లభించింది.
కర్నూలు, మే 19: వేసవి కాలం కొనసాగుతోన్నా.. వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో స్థానికులు.. వజ్రాల అన్వేషణ కోసం రంగంలోకి దిగారు. అందులో భాగంగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఒక రైతుకు వజ్రం లభించినట్లు తెలుస్తుంది. ఈ వజ్రాన్ని రూ. 1.50 లక్షలకు రైతు నుంచి వ్యాపారి కొనుగోలు చేసినట్లు ఓ చర్చ స్థానికంగా నడుస్తోంది.
వర్షాలు పడ్డాయంటే చాలు.. రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ ప్రారంభమవుతోందన్న సంగతి అందరికి తెలిసిందే. జస్ట్ ఒకే ఒక్క వజ్రం లభిస్తే చాలు.. జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయనే ఆశతో ప్రజలు ఈ వజ్రాల ఆన్వేషణ ప్రారంభిస్తారు. అనంతపురం జిల్లాతోపాటు దానికి సరిహద్దులుగా ఉన్న జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా వజ్రాలు సామాన్యులకు లభించాయి. దీంతో వారంతా లక్షాధికారులైన విషయం విదితమే.
మరోవైపు మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభ కానుంది. దీంతో వజ్రాల అన్వేషణకు ప్రజలు సమాయత్త మవుతున్నారు. వర్షాలు పడడంతో.. భూమి పొరల్లోని వజ్రాలు బయటకు వస్తాయి. వాటిని అన్వేషించే క్రమంలో ప్రజలు.. ఆ వజ్రాలను గుర్తించి సొంతం చేసుకుంటారు. ఇలా దొరికిన వజ్రాలను వ్యాపారులకు విక్రయించిన పలువురు ఇప్పటికే జీవితంలో స్థిరపడినట్లు ఓ చర్చ అయితే స్థానికంగా నడుస్తోంది.
ఇక ఉద్యోగులు సైతం తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి మరి ఈ వజ్రాల అన్వేషణలో పాల్గొంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో వజ్రాల కోసం అన్వేషణ ఒక యజ్జంలా కొనసాగనుందన్నది సుస్పష్టం.
ఈ వార్తలు కూడా చదవండి..
GVMC Dy Mayor: నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపిక
Akash Missile: ఆకాశ్ పనితీరు చూసేందుకు.. కలాం ఉంటే బాగుండేది
Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
For AndhraPradesh News And Telugu News