Share News

GVMC Dy Mayor: నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపిక

ABN , Publish Date - May 19 , 2025 | 07:50 AM

GVMC Dy Mayor: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక మరికాసేపట్లో ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో ఈ పీఠం ఎవరికి దక్కనుందనేది ఈ రోజు తెలిపోనుంది.

GVMC Dy Mayor: నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపిక
GVMC

విశాఖపట్నం, మే 19: విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11.00 గంటలకు జీవీఏంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. జీవీఏంసీ మేయర్ పదవి ఇప్పటికే టీడీపీ తీసుకుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించే అవకాశముందని తెలుస్తుంది. ఈ రోజు ఉదయం సీల్డ్ కవర్‌లో అభ్యర్థి పేరును కూటమి నేతలు వెల్లడించనున్నారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది.

గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఏంసీ)కు జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జీవీఏంసీ మేయర్‌ హరి కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో.. మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సైతం కూటమి నెగ్గింది. ఈ పదవి జనసేన పార్టీకి దక్కే అవకాశముందని తెలుస్తోంది.


మరోవైపు.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు అంతా కలిసి చర్చించి డిప్యూటీ మేయర్ ఎంపికపై ఓ నిర్ణయానికి రావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం.

తిరువురులో..

మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు సోమవారం తెర పడనుంది. ఈ రోజు 11.00 గంటలకు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్థానిక మీటింగ్ హాల్‌లో అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఎన్నికల అధికారిగా తిరువూరు ఆర్డీవో కె. మాధురిని ఎన్నికల కమిషన్ ఇప్పటికే నియమించింది. ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ చైర్ పర్సన్ గత్తం కస్తూరి బాయ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఖాళీ ఏర్పడింది.


వైసీపీ కౌన్సిలర్లు కొందరు టీడీపీకి మద్దతు ఇస్తే.. చైర్మన్ పీఠం టీడీపీకి దక్కే అవకాశముంది. వైసీపీ సభ్యులు ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వైసీపీలో తీవ్ర విబేధాలున్నాయని.. ఆ కారణంగా కొందరు వైసీపీ సభ్యకులు పక్క చూపులు చూస్తున్నారనే ఓ ప్రచారం నడుస్తోంది. ఇక నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సందర్బంగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.


ఇంకోవైపు.. నగర పంచాయతీ‌లో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20 ఉన్నారు. వారిలో వైసీపీకి 17, టీడీపీకి 3 సభ్యులు ఉన్నారు. ఇక ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారు.


కదిరిలో..

అలాగే సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపల్ చైర్ పర్సన్‌తోపాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదుర్చేందుకు స్థానిక ఎంఎల్ఏ కందికుంట తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక బెంగళూరు క్యాంపు నుంచి టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి నేరుగా చేరుకోనున్నారు. ఈ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యే అవకాశముందని సమాచారం. మొత్తం 36 వార్డులకుగాను టీడీపీకి 25, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు.


రామగిరిలో..

ఇక శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి ఎంపీపీకి సైతం నేడు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీపీ ఎన్నిక గదిలోనూ, కార్యాలయం బయట అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక నేపథ్యంలో రామగిరిలో 144 సెక్షన్‌ను విధించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Akash Missile: ఆకాశ్‌ పనితీరు చూసేందుకు.. కలాం ఉంటే బాగుండేది

Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 19 , 2025 | 08:10 AM