పాకిస్తాన్‌కి భారత్ లాస్ట్ వార్నింగ్..!

ABN, Publish Date - Mar 07 , 2025 | 09:42 PM

పాకిస్తాన్‌కు భారత్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఆక్రమిత కాశ్మీర్‌ను వెనక్కి ఇస్తేనే ద్వైపాక్షిక సమస్య పరిష్కారం అవుతోందని పాక్‌కు భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. దీంతో భుజాలు తడుము కోవడం పాకిస్తాన్ వంతయింది. అయితే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్టేట్‌మెంట్ సైతం చర్చనీయాంశమైంది.

పాకిస్తాన్‌కు భారత్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఆక్రమిత కాశ్మీర్‌ను వెనక్కి ఇస్తేనే ద్వైపాక్షిక సమస్య పరిష్కారం అవుతోందని పాక్‌కు భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. దీంతో భుజాలు తడుము కోవడం పాకిస్తాన్ వంతయింది. అయితే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్టేట్‌మెంట్ సైతం చర్చనీయాంశమైంది. ఎన్నిసార్లు పాకిస్తాన్‌కు బుద్ది చెప్పినా.. తన తీరు మార్చుకోవడం లేదు. ఆక్రమి కశ్మీర్ వదిలి పక్కకు జరగాలని ఎన్ని హెచ్చరికలు చేసినా.. వాళ్లు జిడ్డులా పట్టుకొని వేలాడుతోన్నారు. పైగా ఆజాద్ కశ్మీర్ అంటూ వాళ్లు నిత్యం అదే పాట పాడుతోన్నారు. సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం కారణంగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు, సంప్రదింపులు నిలిచిపోయాయి. ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పి చాలా రోజులైంది. అక్రమించిన భూభాగాన్ని వెనక్కి ఇచ్చేందుకు పాక్ నిరాకరిస్తుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 07 , 2025 | 09:46 PM