గోవాలో ఘనంగా 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్

ABN, Publish Date - Nov 22 , 2025 | 07:34 PM

గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుక ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

గోవా, నవంబర్ 22: 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుక ప్రారంభోత్సవానికి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. NFDC ఆధ్వర్యంలో మూవీ థీమ్ ప్రదర్శన చేశారు. ఎన్ఎఫ్ డీసీ 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.. గోవాను క్రియేటీవ్ క్యాపిటల్ గా తయారు చేస్తామని తెలిపారు. నవంబర్ 20 నుండి 28 వరకు జరగనున్న ఈ వేడుక దేశ,విదేశాల సినీ ప్రముఖులకు వేదికగా మారనుంది. ప్రారంభ వేడుకకు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, హీరోయిన్ శ్రీలీల, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకం చేశారు. ఇఫీ ముగింపు కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కూడా సన్మానించేందుకు ప్లాన్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్, న్యూయార్క్ మేయర్ భేటీపై శశిథరూర్ ఆసక్తికర పోస్ట్

హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated at - Nov 22 , 2025 | 08:17 PM