రైతులకు గవర్నర్ శుభవార్త...

ABN, Publish Date - Feb 24 , 2025 | 12:51 PM

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రైతులకు శుభవార్త చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. 48 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. 2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదని, రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా చర్యలు చేపట్టామని గవర్నర్ వెల్లడించారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (AP Assembly Budget Sessions) ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) రైతులకు (Farmers) శుభవార్త (Good News) చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర పథకాల్లో 74 పునరుద్ధరించామని, నీటిపారుదల, రోడ్ల సంబంధిత రూ.10,125 కోట్ల బిల్లులు క్లియర్‌ చేశామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. 48 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. 10 పోర్టులను అంతర్జాతీయ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీలో మెట్రోపై గవర్నర్ కీలక ప్రకటన


2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదని, రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా చర్యలు చేపట్టామని వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ ఏర్పాటు చేశామని, 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్ ఏర్పాటు చేశామని గవర్నర్‌ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీపై సీఐడి పిటి వారెంట్ జారీ

ఐదు నిముషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 24 , 2025 | 12:51 PM