గంటా శ్రీనివాసరావు మనవడి కి గిన్నిస్ బుక్‌లో చోటు
ABN, Publish Date - Dec 21 , 2025 | 02:09 PM
మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనవడు 8ఏళ్ల గంటా జిష్ణు ఆర్యన్‌కి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనవడికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో 8 ఏళ్ల గంటా జిష్ణు ఆర్యన్.. నిమిషంలో 216 డెసిమల్స్ గోల్డెన్ రేషియో అనర్గళంగా చెప్పి రికార్డు క్రియేట్ చేశాడు. ఆర్యన్ ప్రతిభను ప్రశంసిస్తూ పలువురు అభినిందించారు.
జిష్ణు తండ్రి రవితేజ, తల్లి శరణి వీరిద్దరూ నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గోల్డెన్ రేషియో మ్యాథ్స్ లో ఎంతో క్లిష్టమైన నెంబర్. దాన్ని గుర్తుంచుకోవడం అసాధారణమైన మేధస్సుకు నిదర్శనం అని నిపుణులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి
జగన్ పుట్టినరోజు వేడుకలపై తీవ్రంగా స్పందించిన యనమల
Updated at - Dec 21 , 2025 | 02:21 PM