Former Minister Kakani Govardhan Reddy: కాకాణి కీలక వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2025-04-01T13:50:57+05:30 IST
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఇప్పటికే కాకాణికి పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు.

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఇప్పటికే కాకాణికి పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం రాత్రికి ఆయన నెల్లూరుకు చేరుకోనన్నారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని చెప్పారు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.