ట్విట్టర్ పై సైబర్ దాడి..ఉక్రెయిన్ హస్తం..? |

ABN, Publish Date - Mar 11 , 2025 | 09:49 PM

యుద్ధం ప్రారంభమై మూడున్నరేళ్లు అయినా.. రష్యాపై ఇంత పెద్ద దాడి జరగలేదు. ఉక్రెయిన్ అతిపెద్ద అటాక్ చేసింది. అటు ట్విట్టర్‌పై సైతం ఉక్రెయిన్ నుంచే దాడులు జరిగాయని ఎలెన్ మస్క్ ఆరోపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ డౌన్ అయింది. ఒక్క రోజులోనే ఎక్స్ సేవల్లో మూడు సార్లు అంతరాయం ఏర్పడింది. ఎంతో మంది ఎక్స్‌పర్ట్స్ పని చేసే ఎక్స్‌కు ఏమైందని అందరూ ఆశ్చర్య పోయారు.

యుద్ధం ప్రారంభమై మూడున్నరేళ్లు అయినా.. రష్యాపై ఇంత పెద్ద దాడి జరగలేదు. ఉక్రెయిన్ అతిపెద్ద అటాక్ చేసింది. అటు ట్విట్టర్‌పై సైతం ఉక్రెయిన్ నుంచే దాడులు జరిగాయని ఎలెన్ మస్క్ ఆరోపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ డౌన్ అయింది. ఒక్క రోజులోనే ఎక్స్ సేవల్లో మూడు సార్లు అంతరాయం ఏర్పడింది. ఎంతో మంది ఎక్స్‌పర్ట్స్ పని చేసే ఎక్స్‌కు ఏమైందని అందరూ ఆశ్చర్య పోయారు. అయితే ఎక్స్‌పై సైబర్ దాడి జరిగిందని ఆ సంస్థ యజమాని ఎలెన్ మస్క్ తెలిపారు. తాము ప్రతి రోజు సైబర్ దాడి జరుగుతొందని.. కానీ ఈ రోజు మాత్రం భారీ కుట్ర జరిగిందని.. అందులో ఓ దేశం హస్తం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని వెనుక ఉక్రెయిన్ ఉందన్నారు. ఈ సైబర్ దాడికి పాల్పడిన వాటికి సంబంధించి ఐపీ అడ్రెస్‌లు ఆ దేశానివేనని ఎలెన్ మాస్క్ చెప్పారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 11 , 2025 | 09:49 PM