Plastic surgery: ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
ABN , First Publish Date - 2025-04-03T13:59:53+05:30 IST
సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన అత్యాచార ఘటనలో గాయపడిన బాధితురాలికి వైద్యలు ప్లాస్టక్ సర్జరీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న బాధితురాలు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన అత్యాచార ఘటనలో గాయపడిన బాధితురాలికి వైద్యలు ప్లాస్టక్ సర్జరీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న బాధితురాలు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో బాధితురాలిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడగా.. తప్పించుకునే క్రమంలో రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. ముఖానికి తీవ్ర గాయాలవడంతో వైద్యులు ప్లాస్టక్ సర్జరీ చేసి, పది రోజుల పాటు చికిత్స అందించారు. అనంతరం బాధితురాలిని ఏపీ కడప జిల్లాలోని స్వగ్రామానికి రైల్వే పోలీసులు తరలించారు.