యువతలో దేశభక్తి నింపాలనే సంకల్పంతో ..

ABN, Publish Date - Jan 26 , 2025 | 01:43 PM

వరంగల్: నేటి యువతరానికి స్వాతంత్య్ర పోరాటాల విశేషాలు, నాటి చిరిత్ర తెలియదనే చెప్పాలి. చాలా మంది అది తెలుసుకునేందుకు కూడా విముఖత చూపుతున్నారు. అయితే ప్రతి ఒక్కరిలో దేశ భక్తి నింపాలనే సంకల్పంతో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు.

వరంగల్: నేటి యువతరానికి స్వాతంత్య్ర పోరాటాల విశేషాలు, నాటి చిరిత్ర తెలియదనే చెప్పాలి. చాలా మంది అది తెలుసుకునేందుకు కూడా విముఖత చూపుతున్నారు. అయితే ప్రతి ఒక్కరిలో దేశ భక్తి నింపాలనే సంకల్పంతో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. హనుమకొండ జిల్లాలోని వెయ్యి స్తంభాల ఆలయం వద్ద నివాసం ఉంటున్న మేహరాజ్ సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటి గోడలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన ఇంటి గోడలపైన స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీయించారు. ఆయన ఆలోచనకు చిత్రకారుడు చంద్ర రూపం ఇచ్చారు. నాటి విశేషాలను కళ్లకు కట్టినట్లుగా అందంగా చిత్రీకరించారు. ప్రతి ఒక్కరిలో దేశ భక్తి ఉండాలనేదే తమ లక్ష్యమని చంద్ర అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..


ఈ వార్తలు కూడా చదవండి..

శివకళై తవ్వకాల్లో బయటపడిన ఇనుప పనిముట్లు

కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..

బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో త్రివర్ణ పతాకం ఎగరవేత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 26 , 2025 | 01:43 PM