ఇనుప యుగం ఇక్కడే ప్రారంభం..
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:08 PM
తమిళనాడు: పురాతన నాగరికతకు నిలయమైన భారతదేశంలో ఇనుప యుగం.. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే రెండు వేల ఏళ్ల ముందే ప్రారంభమైందా.. క్రీస్తుపూర్వం 3,345 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించారా...
తమిళనాడు: పురాతన నాగరికతకు నిలయమైన భారతదేశంలో ఇనుప యుగం.. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే రెండు వేల ఏళ్ల ముందే ప్రారంభమైందా.. క్రీస్తుపూర్వం 3,345 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించారా... ప్రపంచంలోనే ఇనుప యుగం తమిళనేలపైనే ఆరంభమైందా.. అంటే తాజా అధ్యయనాలు అవుననే చెబుతున్నాయి. తమిళనాట 5,300 సంవత్సరాల క్రితమే ఇనుపయుగం ఆరంభమైనట్లు పురావస్తు శాఖ జరిపిన అధ్యయనంలో తేలింది. తమిళనాడులోని మాంగాడు (సేలం), కీళ్‌నమండి (తిరువణ్ణామలై), మయిలాండుంపారై (కృష్ణగిరి), ఆదిచ్చనల్లూరు, శివకళై (తూత్తుకుడి) తదితర ప్రాంతాల్లోని శ్మశానవాటికల్లో జరిపిన తవ్వకాల్లో పలు ఇనుప వస్తువులు లభించాయి. వీటిలో శివకళై వద్ద లభించిన ఇనుప ఆయుధం 5,300 సంవత్సరాల నాటిదని భారత్‌తోపాటు అమెరికాలో జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తమిళనాడుు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు.
ఈ వార్త కూడా చదవండి..
కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో త్రివర్ణ పతాకం ఎగరవేత..
అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో పరేడ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 26 , 2025 | 01:09 PM