క్షమించండి గవర్నర్..
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:51 PM
Pawan Kalyan: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మాట్లాడిన పవన్.. నిన్న అసెంబ్లీలో వైసీపీ తీరుపై మండిపడ్డారు.
అమరావతి, ఫిబ్రవరి 25: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) శాసనసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazeer) ఉపముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ నమూనాను దిశానిర్దేశం చేసిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూస్తూ వైసీపీ బాయికాట్ చేయడం దురదృష్టకరమన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా వైసీపీ సభ్యులు ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ప్రసంగం ఇచ్చిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు పవన్.
వైసీపీకి 11 సీట్లు వచ్చినప్పటికీ వారిని ఇబ్బంది పెట్టొద్దని మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చెబుతూనే ఉన్నారని.. అయినా వారి వ్యవహర శైలి మారలేదన్నారు. నిన్న (సోమవారం) సభలో వైసీపీ సభ్యులు బయటకు వెళ్లడాన్ని ఖండిస్తూ.. ఇందులో తమ తప్పు లేకపోయినా గవర్నర్‌కు ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలియజేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన లోకేష్
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. ఆప్‌కు భారీ షాక్
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 25 , 2025 | 04:54 PM