Share News

AP Council: వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్.. మార్క్ మై వర్డ్స్.. మీ అందరూ లోపలికే

ABN , Publish Date - Feb 25 , 2025 | 01:19 PM

AP Council: ఏపీ శాసనమండలిలో కూటమి సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లీష్ మీడియంపై ప్రధానంగా రగడ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

AP Council: వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్.. మార్క్ మై వర్డ్స్.. మీ అందరూ లోపలికే
AP Legislative Council

అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) వాడీ వేడీ చర్చ జరగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో భాగంగా కూటమి, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య రగడ చోటు చేసుకుంది. ఉద్యోగాల కల్పన అంశంపై మండలిలో వైసీపీ.. టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగం అంశంలో తెలుగు.. ఇంగ్లీష్‌లో ప్రచురణల మధ్య తేడా ఉంది అంటూ గందరగోళం నెలకొంది. ప్రజలను ఇబ్బంది పెడుతూ సుపరిపాలన అని చెప్పడం కూటమి ప్రభుత్వానికి ఎంత వరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రశ్నించారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కల్పించామని స్పష్టంగా గవర్నర్ ప్రసంగంలో ఉందని వైసీపీ ఎమ్మెల్సీ అన్నారు.


అలా చెప్పలేదన్న లోకేష్..

దీనిపై మంత్రి లోకేష్ (Minister lokesh) స్పందిస్తూ.. ‘‘మేము ఉద్యోగాలు ఇచ్చామని ఎక్కడా చెప్పలేదు.. ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పాం.. నియమించామని చెప్పలేదు’’ అని స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలన్నారు. వాకౌట్ చేయొద్దని.. అన్నింటిపైనా చర్చిద్దామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం కావాలని అంటారు... మళ్ళీ ఇంగ్లీష్‌లో చెప్తే ఇబ్బంది అంటారని మంత్రి అన్నారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందని.. తప్పుంటే మార్చుకుంటామని చెప్పండి అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

పోలీసు కస్టడీకి వంశీ.. ప్రశ్నలు సిద్ధం


ఆ వ్యాఖ్యలు తప్పన్న మంత్రి...

కేంద్ర ప్రభుత్వం ఏపీ ఎంపీలపై ఆధారపడి ఉందంటూ వైసీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేష్ తప్పుబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు తెలిపామని స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తామని ఆనాడు పులివెందుల ఎమ్మెల్యే అన్నారని.. ఏమైందని అని ప్రశ్నించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిందేంటి అని వైసీపీని నిలదీశారు. ఆనాడు రాష్ట్రాన్నీ కాపాడాలని ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ కోరారని.. దానిలో భాగంగా ఇప్పుడు రైల్వేజోన్‌ను తీసుకొచ్చామని.. పోలవరం నిధులు, అమరావతికి నిధులు తీసుకొచ్చామని తెలిపారు. విశాఖ ఉక్కును కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి చాలా చాలా అవసరమన్నారు. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు కోసం టీడీపీ, జనసేన చేరామని.. అన్‌కండిషనల్‌గా మద్దతు తెలుపుతామన్నారు. ఐదేళ్లలో వైసీపీ తీసుకురాని నిధులను.. తొమ్మిది నెలలో రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు.


లోకేష్ వార్నింగ్..

అలాగే వైసీపీ నేతలకు కూడా మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారో వారిని వదిలే ప్రసక్తే లేదని.. మార్క్ మై వర్డ్స్‌ అంటూ హెచ్చరించారు.


తెలుగును కించపరిచిన వైసీపీ ఎమ్మెల్సీ

ఏపీ శాసనమండలిలో ఇంగ్లీష్‌ మీడియంపై రగడ చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం లేకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఎలా వస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించగా.. హోంమంత్రి అనిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సభ్యులు తెలుగును అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలుగు మీడియంలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థానానికి వెళ్లారని.. ఆ విషయం వైసీపీ ఎమ్మెల్సీలకు తెలియదా అంటూ మండిపడ్డారు. వెంటనే వైసీపీ సభ్యులు తమ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 02:52 PM