CM Revanth Reddy: అందెశ్రీ పాడె మోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Nov 11 , 2025 | 01:52 PM
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ఘట్‌కేసర్‌లో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలి వచ్చారు. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాల్గొన్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఇవాళ (మంగళవారం) ఘట్కేసర్ చేరుకున్న సీఎం.. అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు. మంగళవారం ఉదయం అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు అంతిమయాత్ర సాగింది. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అందె శ్రీ అంత్యక్రియల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వి. హనుమంతరావు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..
ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం పాడాల్సిందే.!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated at - Nov 11 , 2025 | 01:55 PM