ఆడబిడ్డల జోలికొచ్చారో..
ABN, Publish Date - Mar 11 , 2025 | 03:12 PM
Chandrababu Warns: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు ఇకపై తప్పించుకోలేరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు.
అమరావతి, మార్చి 11: ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు అవుతుందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీలో (AP Assembly Session) సీఎం మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం వచ్చిందని, ఆడబిడ్డలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇకపై ఎవరైనా ఆడబిడ్డలపై అత్యాచారాలు చేసి తప్పించుకోవాలనుకుంటే కూటమి ప్రభుత్వంలో (AP Govt) వీలుకాదన్నారు. అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇంకా కొన్ని చోట్ల ఆకతాయిలు అమ్మాయిల పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్నారు.
అలాగే ఎట్టి పరిస్థితిల్లోనే రాష్ట్రంలో గంజాయి పండించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అది జరిగే వరకు ప్రభుత్వం నిరంతం పోరాడుతూనే ఉంటుందన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామన్నారు. గంజాయి పండించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్నారు. మత విద్వేషాలు లేని వాతావరణం ఉండాలన్నారు. ముఠాలు, కుమ్ములాటలు ఇక చెల్లవని రాష్ట్రంలో రౌడీలు ఉండడానికి వీల్లేదన్నారు. రౌడీయిజం చేసి తప్పించుకుంటాం అంటే కుదరదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Police Complaint Against Duvvada: వరుస కేసులు.. నెక్ట్స్ దువ్వాడేనా
Vamsi Case Update: వంశీ కేసు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
Read Latest AP News And Telugu News
Updated at - Mar 11 , 2025 | 03:12 PM