Congress VS BRS: వెంకన్న ఆలయంపై రాజకీయ వార్ .. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

ABN, Publish Date - Feb 04 , 2025 | 03:13 PM

భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొత్త వివాదం ఏర్పడింది. స్థానికంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంపై రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది.

భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొత్త వివాదం ఏర్పడింది. స్థానికంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంపై రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యేల మధ్య టెంపుల్ వార్ కొనసాగుతోంది. గండ్రా సత్యనారాయణరావు, గండ్ర వెంకటరామణారెడ్డిల మధ్య వేంకటేశ్వర స్వామి ఆలయం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.


గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణానికి అనుబంధంగా ఆలయ నిర్వహణ ఖర్చుల కోసమంటూ ఆలయం పక్కనే వాణిజ్య భవన సముదాయాన్ని నిర్మించారు. అయితే ఈ భవనం ద్వారా వాణిజ్య కార్యయాకలపాలు నిర్వహించడానికి మాజీ ఎమ్మెల్యే వర్గం వ్యూహత్మకంగా పావులు కదుపుతోందని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భావించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 04 , 2025 | 03:24 PM