నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు..

ABN, Publish Date - Dec 10 , 2025 | 07:26 PM

నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లి పోయారు.

నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లి పోయారు. బుధవారం ఉదయం ఇంటి ఆరు బయట ముగ్గు వేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని.. అప్పటికే ఆ సమీపంలో బైక్ పై ఉన్న వ్యక్తితో కలిసి చైన్ స్నాచర్ పరారయ్యాడు. మహిళ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

Maria Machado: నోబెల్ పురస్కారం ప్రదానోత్సవానికి శాంతి బహుమతి విజేత గైర్హాజరు

ఉపాధ్యాయుడిగా మారిన అనంతపురం జిల్లా కలెక్టర్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 10 , 2025 | 07:33 PM