బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూ వివాదం

ABN, Publish Date - Mar 11 , 2025 | 04:06 PM

BRS MLC land dispute: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు చెందిన భూమిలో ప్రైవేటు వ్యక్తులు హల్‌చల్ చేశారు. కంచె వేసేందుకు ప్రయత్నించడంతో కొద్దిపాటి ఘర్షణ చోటు చేసుకుంది.

హైదరాబాద్, మార్చి 11: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు (BRS MLC Naveen Rao) భూమి వివాదాస్పదంగా మారింది. మాదాపూర్‌లోని నవీన్ రావు భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు కంచె వేసేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ మనుషులు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో భూ వివాదంపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో (Kukatpally MLA Madhavaram Krishna Rao) కలిసి ఎమ్మెల్సీ నవీన్‌ రావు మాదాపూర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు.


ఇవి కూడా చదవండి..

Vamsi Case Update: వంశీ కేసు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే

Complaint on KCR: కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 11 , 2025 | 04:06 PM