ABN Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ABN, Publish Date - Mar 13 , 2025 | 10:29 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ 11వ రోజు బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అలాగే శాసన మండలి పదవ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ (AP Assembly) 11వ రోజు (11th Day) బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అలాగే శాసన మండలి (Legislative Council) పదవ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఆయా శాఖల బడ్జెట్ పద్దులపై ఉభయ సభల్లో చర్చ జరిగి ఆమోదం పొందనున్నాయి. 2024 ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకము సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Also Read..:
చిన్న వివాదం.. యువకులు దాడి.. వృద్ధుడు మృతి..
శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది.
శాసన మండలిలో సామాజిక భద్రత ఫించన్లు.. రాష్ర్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. పర్మిట్ రూములకు అనుమతి .. పీడీఎఫ్ బియ్యం అక్రమ అమ్మకం.. జగనన్న కాలనీల్లో అక్రమాలు.. నూతన పర్యాటక విధానం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 2019- 2024 మధ్య జరిగిన కుంభకోణాలపై శాసన మండలిలో లఘు చర్చ జరగనుంది. ఏబీఎన్ లైవ్ చూడండి..
ఈ వార్తలు కూడా చదవండి..
సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..
తిరుపతి జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు..
For More AP News and Telugu News
Updated at - Mar 13 , 2025 | 10:33 AM