సాక్షి బోర్డు పీకేసిన అమరావతి మహిళా నేతలు
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:44 PM
రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక విజయవాడలోని సాక్షి కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. సాక్షి కార్యాలయం నేమ్ బోర్డును సైతం మహిళలు ధ్వంసం చేశారు.
సాక్షి మీడియాలోని చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. రాజధాని వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో సాక్షిలో ప్రసారమైన చర్చ వేదికలో కొమ్మినేని సైతం ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. దీంతో ఆయనపై ప్రజలు మండిపడుతున్నారు. అదీకాక ఈ వ్యవహారంలో కొమ్మినేని, కృష్ణంరాజుతోపాటు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 09 , 2025 | 05:45 PM