Amaravati Farmers: వారిని శిక్షించాలని అమరావతి రైతుల ఆగ్రహం.. మళ్లీ నిరసనలు

ABN, Publish Date - Jun 08 , 2025 | 07:10 PM

ఆ ఇద్దరినీ శిక్షించే వరకు మా పోరాటం ఆగదని అమరావతి రైతులు (Amaravati Farmers) తమ నిరసనను మళ్లీ ఉధృతం చేస్తున్నారు. రాజధాని విషయంలో సాక్షి మీడియా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి మీడియా ప్రతినిధులైన కొమ్మినేని శ్రీనివాస రావు, జర్నలిస్ట్ కృష్ణంరాజులను శిక్షించే వరకు మా పోరాటం ఆగదని అమరావతి రైతులు (Amaravati Farmers) స్పష్టం చేశారు. రాజధాని విషయంలో అసభ్య వ్యాఖ్యలు చేసిన వీరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేవరకు వెనక్కి తగ్గబోమని రైతులు అన్నారు. ఉద్యమాన్ని దిగజార్చే ప్రయత్నాలకు తాము భయపడమని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. ఈ క్రమంలో మళ్లీ సమరశంఖం పూరిస్తామని, న్యాయం జరిగే వరకు తమ పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని రైతులు హెచ్చరించారు.

Updated at - Jun 08 , 2025 | 07:10 PM