అమరావతికి పున:ప్రాణ ప్రతిష్ట
ABN, Publish Date - May 02 , 2025 | 10:33 AM
Amaravati Capital Revival: అమరావతి పున:నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు.
అమరావతి, మే 2: ఐదేళ్లు ఆగిన అమరావతికి పున:ప్రాణప్రతిష్ట జరుగుతోంది. తెలుగు వారి కలకల రాజధానిగా మొదలై.. వడివడిగా పరుగులు తీసి.. జగన్ రాకతో ఒక్కసారిగా కుదేలైన రాజధానిలో మళ్లీ పనుల కల మొదలైంది. 2015 అక్టోబర్ 22న ప్రధాన మంద్రి హోదాలో నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిరాటంకంగా, నిర్విరామంగా పనులు కొనసాగాయి. అవి అదే వేగంతో.. అంతే ఊపుతో కొనసాగి ఉంటే ఇప్పటికే కీలక నిర్మాణాలన్నీ పూర్తి అయ్యి మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిగేవి. ప్రజా రాజధాని ఈ పాటికి కళ్ల ముందు సాక్షాత్కరించేంది.
కానీ జగన నిర్వాకంతో ఐదేళ్లకు పైగా కాలం కరిగిపోయింది. అమరావతి చిట్టడవిలా మారిపోయింది. దాదాపుగా పూర్తి అయిన నిర్మాణాలకు దిక్కులేకుండా పోయింది.
మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి
Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు
Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి
Read Latest AP News And Telugu News
Updated at - May 02 , 2025 | 10:38 AM