ఏసీబీ రైడ్స్.. వామ్మో ఎంత సొమ్మో...

ABN, Publish Date - Feb 07 , 2025 | 04:46 PM

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హనుమకొండ ట్రాన్స్‌పోర్టు డీటీసీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించింది ఏసీబీ.

వరంగల్, ఫిబ్రవరి 7: హనుమకొండ ట్రాన్స్‌పోర్ట్‌ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు (ACB Raids) నిర్వహించింది. హైదరాబాద్, వరంగల్‌తో పాటు 8 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ డీటీసీ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది. ఆయనతో పాటు జగిత్యాల, హైదరాబాద్, కరీంనగర్‌లో శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులను కూడ పెట్టారన్న ఆరోపణలపై సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 50 కోట్లకు పైచిలుకు ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది.


ఇవి కూడా చదవండి...

జగన్‌కు సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Bathula Prabhakar: బత్తులను కస్టడీకి కోరిన పోలీసులు.. విచారణ వాయిదా

Read Latest Telangana News And Telugu News

Updated at - Feb 07 , 2025 | 04:46 PM