Formula-E Car Race Case: ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్.! ఏసీబీ తుది నివేదిక!

ABN, Publish Date - Nov 22 , 2025 | 09:10 PM

ఫార్ములా ఈ రేస్ కేసులో సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించిన ఫైనల్ రిపోర్ట్‌లో ఏసీబీ కీలకమైన విషయాలను పొందుపరచింది. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఫార్ములా ఈ రేస్ కేసులో సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించిన ఫైనల్ రిపోర్ట్‌లో ఏసీబీ కీలకమైన విషయాలను పొందుపరచింది. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ-1 గా కేటీఆర్, ఏ-2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ-3 గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ-4 గా, ఏ-5 గా ఎఫ్ఈవో ప్రతినిధులను చేర్చింది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలనేది కేటీఆర్ సొంత నిర్ణయమని ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో రేస్ నిర్వహిచారని, క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారని, ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే ఎలక్ట్రోరల్ బాండ్లు చెల్లించారని గుర్తించింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Nov 22 , 2025 | 09:10 PM