ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కాం..రోజాకు బిగిసుకున్న ఉచ్చు |
ABN, Publish Date - Mar 10 , 2025 | 07:40 PM
ఆడుదాం ఆంధ్రలో ఏ విధంగా అవినీతి జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం రూ. 120 కోట్లు విడుదల చేసింది. అందులో గరిష్టంగా దోచేశారంటూ ఓ చర్చ సైతం సాగుతోంది. విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీయడం కోసం ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకాన్ని కేవలం రాజకీయం కోసమే వాడుకొన్నట్లుగా పరిస్థితులు కనిపించాయి.
ఆడుదాం ఆంధ్రలో ఏ విధంగా అవినీతి జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం రూ. 120 కోట్లు విడుదల చేసింది. అందులో గరిష్టంగా దోచేశారంటూ ఓ చర్చ సైతం సాగుతోంది. విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీయడం కోసం ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకాన్ని కేవలం రాజకీయం కోసమే వాడుకొన్నట్లుగా పరిస్థితులు కనిపించాయి. ఇంకా చెప్పాలంటే పూర్తిగా రాజకీయంగా కూడా ఉపయోగించుకున్న పరిస్థితి కనిపించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆడుదాం ఆంధ్ర తీసుకు రావడం.. అందులో యువతను సైతం భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పినప్పటికీ.. అందులో అంతా వైసీపీకి సంబంధించిన వాళ్లు ఇందులో ప్రదానంగా పాల్గొన్నారు.
అంతేకానీ విద్యార్థులను ఎక్కడా పాల్గొనివ్వలేదు. అన్ని నాసిరకమైన క్రీడా సామాగ్రిని అందజేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ పథకం కోసం ప్రచారం సైతం చాలా భారీగా చేపట్టారు. ప్రచారానికే దాదాపు రూ. 35 కోట్లు ఖర్చే చేశారు. జగన్ ప్రభుత్వంలో ఆర్ కే రోజా నిర్వహిస్తున్న శాఖలో.. శాప్ చైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఉన్న హయాంలో.. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో .. కేవలం 47 రోజుల్లో రూ. 127 కోట్లను ఖర్చు చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 10 , 2025 | 07:40 PM