Hyderabad: 35 ఏళ్ల తర్వాత జూపార్కు లోకి జీబ్రాలు..
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:07 PM
జవహర్‌లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్కు) లోని ఎన్‌క్లోజర్‌లోకి గుజరాత్ నుంచి తీసుకువచ్చిన మూడు జీబ్రాలను వదిలారు. సోమవారం 62వ జూ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- జూ లో కనువిందు చేయనున్న జీబ్రాలు
హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్కు) లోని ఎన్‌క్లోజర్‌లోకి గుజరాత్(Gujarat) నుంచి తీసుకువచ్చిన మూడు జీబ్రాలను(Zebras) వదిలారు. సోమవారం 62వ జూ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి.సువర్ణ పాల్గొని సందర్శకులు తిలకించడానికి వీలుగా జీబ్రాలను ఎన్‌క్లోజర్(Enclosure)లోకి వదిలారు. 35 ఏళ్లుగా జూపార్కులో జీబ్రాలు లేవు. ఈ లోటును పూడ్చడానికి అధికారులు జీబ్రాలను తీసుకువచ్చారు.

అందులో రెండు ఆడ, ఒకమగ జీబ్రా ఉన్నాయి. జంతు మార్పిడిలో భాగంగా వంతారా జూపార్కుకు 20 మూషిక జింకలను ఇచ్చి, అక్కడి జూపార్కు నుంచి జీబ్రాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సింభా క్యాంటీన్, ఎలుగుబంట్ల కోసం నిర్మించిన నైట్ హౌజ్‌లను డాక్టర్ సి.సువర్ణ ప్రారంభించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
Read Latest Telangana News and Nationa